వాహనదారులకు అలర్ట్​.. హైదరాబాద్​ లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

కలం, వెబ్​ డెస్క్​: హైదరాబాద్ లో నేడు (శనివారం) ట్రాఫిక్​ ఆంక్షలు (Hyderabad Traffic Restrictions) అమలు చేయనున్నారు. గురునానక్​ దేవ్​ 557వ జయంతి సందర్భంగా నగరంలో మతపరమైన ఊరేగింపు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 వరకు ఈ ఊరేగింపు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్​ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు చేయనున్నాయి.

అశోక్​ బజార్​ లోని గురుద్వారా నుంచి ఊరేగింపు ప్రారంభమై అఫ్జల్​ గంజ్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్,​ పుత్లీబౌలీ మీదుగా శంకర్​ షేర్​ వరకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి గురుద్వారాకు చేరుకోవడంతో ఊరేగింపు కార్యక్రమం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఈ విషయం గమనించాలని హైదరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు సూచించారు. ఆంక్షలు (Hyderabad Traffic Restrictions) అమలులో ఉన్న ఆయా మార్గాల్లో ప్రయాణించే వారు ప్రత్నామ్యాయ మార్గాలను ఎంచుకోవాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>