మత్తుకు యువత దూరంగా ఉండాలి : కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బ్రహ్మకుమారీస్ సేవా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్ ‘మిషన్ స్పందన్’ అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) పాల్గొని ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు దురలవాట్లు యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వ్యసన రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రచార కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జ్యోతి, బీకే రేవతి, పుష్ప, గీత, అర్చన, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>