వేములవాడలో ఇందిరమ్మ బీమా దరఖాస్తులు షురూ.. చివరి తేదీ ఎప్పుడంటే?

కలం, ​వేములవాడ: కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయే నిరుపేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas), జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. శుక్రవారం వేములవాడ (Vemulawada) పట్టణంలోని నాలుగో వార్డులో ఈ పథకం దరఖాస్తుల స్వీకరణ (Insurance Registration) ప్రక్రియను వారు ప్రారంభించి, కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి ఐదు లక్షల కుటుంబాలకు గ్రూప్ ఇన్సూరెన్స్ అందించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని తెచ్చారని ఆది శ్రీనివాస్ తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారిని ప్రధాన సభ్యుడిగా కుటుంబమే ఎంచుకోవచ్చని వివరించారు.

​నమోదు ప్రక్రియ.. ఆలయ విస్తరణపై స్పష్టత

ఆధార్, రేషన్ కార్డు, ఫోన్ నంబర్ వివరాలతో డిసెంబర్ 19 వరకు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల ప్రత్యేక శిబిరాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రేషన్ కార్డు లేని అర్హులనూ గుర్తించి చేర్చాలన్నారు. మరోవైపు, రూ.250 కోట్లతో చేపడుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు శృంగేరి పీఠాధిపతి సూచనలు, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారమే జరుగుతున్నాయని, దుష్ప్రచారాలను నమ్మవద్దని ఆది శ్రీనివాస్ భక్తులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, ఆర్డీవో కేఎస్‌బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, కమిషనర్ లోకేష్, తహశీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>