జమ్మికుంటలో SFI జిల్లా 19వ మహాసభలు.. ఎప్పటినుంచంటే?

కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా 19వ మహాసభలను డిసెంబర్ 2, 3 తేదీల్లో జమ్మికుంట (Jammikunta) మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్(Gajjela Srikanth) తెలిపారు. ఈ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను జమ్మికుంట వొకేషనల్ కళాశాలలో SFI జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. తొలిసారిగా జమ్మికుంటలో నిర్వహిస్తున్న ఈ మహాసభలకు విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్ (Gajjela Srikanth) మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, విద్యార్థుల హక్కుల సాధనకు SFI కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడంపై ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత, సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు పరిష్కారం కాకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

కొత్త చట్టాలు, విద్యా విధానాలపై విద్యార్థుల్లో ఆందోళనలు నెలకొంటున్నాయని తెలిపారు. ఈ మహాసభల్లో విద్యారంగ సమస్యలపై విస్తృతంగా చర్చించి, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో SFI మండల అధ్యక్ష, కార్యదర్శులు సిద్ధిక్, అనిల్‌తో పాటు నాయకులు మహేష్, అక్షయ్, అలీ, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : మోదీ విజిటింగ్ ప్రైమ్ మినిస్టర్ : సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>