ప్రాజెక్టు చీతాలో మరో మైలురాయి.. 4 కూనలకు జన్మనిచ్చిన చిరుత!

కలం, వెబ్ డెస్క్: ప్రాజెక్టు చీతాతో (Project Cheetah) భారత్ లో చిరుతల సంతతి పెరుగుతోంది. బోట్స్వానా నుంచి తీసుకొచ్చిన రెండున్నరేళ్ల ఆడ చిరుత ‘కోఎమ్‌జి 3’ అడవిలో ఒకేసారి 4 కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

బోట్స్వానా నుంచి భారత దేశానికి తీసుకొచ్చిన చిరుతల్లో పిల్లలకు జన్మనిచ్చిన తొలి ఆడ చిరుత ఇదే అని కేంద్రమంత్రి తెలిపారు. ప్రాజెక్టు చీతాలో ఇది కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. నాలుగు నెలలకు పైగా అడవిలో సహజ సిద్దంగా గడిపిన తరువాత కోఎమ్‌జి 3 చిరుత కూనలకు జన్మనిచ్చిందని వెల్లడించారు.

తాజాగా జన్మించిన నాలుగు కూనలతో కలిసి భారత్ లో చిరుతల సంఖ్య 62కు చేరిందని కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. వీటిలో భారత్ లో జన్మించిన చిరుతలు 43 ఉండడం విశేషం. కాగా, భారత్ లో చిరుతల సంతతిని పెంచేందుకు కేంద్రప్రభుత్వ ‘ప్రాజెక్టు చీతా’ (Project Cheetah) ను చేపట్టింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>