పవన్ కల్యాణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. కత్తితో వ్యక్తి హంగామా!

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ఒక వ్యక్తి కత్తితో వచ్చి హల్‌చల్ చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని పోలీసులకు అప్పగించడంతో ప్రమాదం తప్పింది.

ఖమ్మం జిల్లాకు చెందిన సుచేతన్ ఠాకూర్ నాయక్ (Suchetan Thakur Naik) అనే బిల్డర్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తనకు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరుతూ ఆయన నివాసం వద్దకు చేరుకున్నాడు. గత 16 రోజులుగా పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అవకాశం దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.

సుచేతన్ తన వెంట తెచ్చుకున్న కత్తితో అక్కడున్న బౌన్సర్లపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అంతటితో ఆగకుండా తనను తాను గాయపరుచుకునేందుకు యత్నించాడు. వెంటనే స్పందించిన బౌన్సర్లు అతడి చేతిలోని కత్తిని లాక్కున్నారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుచేతన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : ఇన్సూరెన్స్ లేకపోతే రూ.10 వేలు ఫైన్.. NHAI క్లారిటీ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>