సౌదీపై హౌతీల మిస్సైల్ దాడి.. దెబ్బతిన్న పీఐఎఫ్ టవర్‌!

కలం, వెబ్ డెస్క్: సౌదీ అరేబియా రాజధాని రియాద్ పై హౌతీలు క్షిపణి దాడులకు (Riyadh Missile Attack) పాల్పడ్డారు. మిస్సైల్ దాడిని దళాలు అడ్డుకున్నా శిథిలాలు పడడంతో కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) టవర్‌ దెబ్బతిన్నంది.

రియాద్‌లోని అత్యంత ఎత్తైన భవనాల్లో ఈ టవర్ ఒకటి. మిస్సైల్ దాడితో కొన్ని అంతస్తుల్లోని కిటికీలు పగిలిపోవడంతో పాటు పీఐఎఫ్ తీవ్రంగా దెబ్బతిన్నది. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని సౌదీ సివిల్ డిఫెన్స్ వెల్లడించింది. క్షిపణి దాడిలో సమీపంలోని కొన్ని భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.

విమాన సర్వీసుల రద్దు

క్షిపణి దాడి (Riyadh Missile Attack) నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థ ఇండిగో సౌదీ అరేబియాకు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేసింది. జెద్దా, మదీనా, రియాద్, దమ్మామ్ మార్గాల్లో నవంబర్ 30 వరకు ఫ్లైట్ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>