కలం, మానకొండూరు : సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన బహిరంగ సభకు (Siddipet Public Meeting) మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ఎమ్మెల్యే, టీపీసీసీ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపు మేరకు మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్, గన్నేరువరం, బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల నుంచి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సిద్దిపేటకు బయలుదేరారు. సుమారు 50 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, కార్లలో పార్టీ జెండాలతో ఉత్సాహంగా సభకు పయనమయ్యారు. సర్పంచులు, ఉప సర్పంచులు, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తరలింపులో పాల్గొన్నారు.
మానకొండూరు మండలం నుంచి 12 బస్సులు
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రేవెల్లి రాజలింగం, వైస్ చైర్మన్ రేమిడి శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ముద్దసాని శ్రీనివాసరెడ్డి, నాగిశెట్టి రాజయ్య, రొంటాల లక్ష్మారెడ్డి సహకారంతో మండలానికి కేటాయించిన 12 ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరాయి. ఆయా గ్రామాల సర్పంచులు, పార్టీ అధ్యక్షులు జెండాలు ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్ర చారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, మాజీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శంకరపట్నం నుంచి భారీ స్పందన
పీసీసీ సభ్యుడు, మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి తిరుపతి ఆధ్వర్యంలో శంకరపట్నం మండలంలోని అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లాయి. పీఏసీఎస్ చైర్మన్లు కీసరి సంపత్, గోపగోని బసవయ్య గౌడ్, గాజుల మహేష్‌తో పాటు సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహం
మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేష్ ఆధ్వర్యంలో నుస్తులాపూర్, పోరండ్ల గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరారు. పీఏసీఎస్ చైర్మన్లు మోరేపల్లి రమణారెడ్డి, గోపు తిరుపతిరెడ్డితో పాటు గోపు మల్లారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కుంట రాజేందర్ రెడ్డి, డి. సంపత్ రెడ్డి, కంది చిన్న అశోక్ రెడ్డి, మామిడి అనిల్ కుమార్ తదితరులు తరలివెళ్లారు.
బెజ్జంకి, గన్నేరువరం, ఇల్లంతకుంట నుంచి తరలింపు
బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్ ఆధ్వర్యంలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఏఎంసీ, పీఏసీఎస్ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరారు. గన్నేరువరం మండల పార్టీ అధ్యక్షుడు బొడ్డు సునీల్, ఏఎంసీ చైర్మన్ మాతంగి శిరీష అనిల్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లాయి. ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంతగిరి సాహిత్య వినయ్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ ఊట్కూరి వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు, ఉప సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్దిపేట సభకు బయలుదేరారు.
కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్
మానకొండూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావడంతో సిద్దిపేట సభకు (Siddipet Public Meeting) పార్టీ మద్దతు స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి సభలో పాల్గొనేందుకు నాయకులు, కార్యకర్తలు చూపిన ఉత్సాహం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది.
Also Read : కాంగ్రెస్ నేతలు తిన్న అవినీతి సొమ్ము కక్కిస్తాం: కేటీఆర్
Follow Us On: X(Twitter)

