తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ఇంట‌ర్ బోర్డు ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ (Telangana Inter Exams Schedule)ను విడుద‌ల చేసింది. ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 19 వరకు జరగనున్నాయి. సెకండ్ ఇయ‌ర్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 20 వరకు నిర్వహించనున్నారు. ప‌రీక్ష‌లు ప్ర‌తి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జ‌రుగుతాయి. థియ‌రీ ప‌రీక్ష‌ల‌కు ముందే ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 10 వ‌ర‌కు సెకండ్ ఇయ‌ర్ ప్రాక్టిక‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 11 నుంచి 18 వ‌ర‌కు ఫ‌స్ట్ ఇయ‌ర్‌ ప్రాక్టిక‌ల్స్ జ‌రుగ‌నున్నాయి.

ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్

– ఫిబ్రవరి 24: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
– ఫిబ్రవరి 26: ఇంగ్లీష్ పేపర్-1
– మార్చి 2: మ్యాథ్స్-IA, బోటనీ, పొలిటికల్ సైన్స్, అకౌంటెన్సీ
– మార్చి 5: మ్యాథ్స్-IB, జువాలజీ, హిస్టరీ, కామర్స్
– మార్చి 9: ఫిజిక్స్, ఎకనామిక్స్
– మార్చి 15: కెమిస్ట్రీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-1
– మార్చి 17: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మ్యాథ్స్-1
– మార్చి 19: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్-1

సెకండ్ ఇయర్ ఎగ్జామ్ షెడ్యూల్

– ఫిబ్రవరి 25: సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
– ఫిబ్రవరి 27: ఇంగ్లీష్ పేపర్-2
– మార్చి 3: మ్యాథ్స్-IIA, బోటనీ, పొలిటికల్ సైన్స్
– మార్చి 8: మ్యాథ్స్-IIB, జువాలజీ, హిస్టరీ
– మార్చి 12: ఫిజిక్స్, ఎకనామిక్స్
– మార్చి 16: కెమిస్ట్రీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్-2
– మార్చి 18: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2
– మార్చి 20: మోడ్రన్ లాంగ్వేజ్, జాగ్రఫీ, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్-II

ఇతర పరీక్షల తేదీలు

థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలతో పాటు ఇతర ప‌రీక్ష‌ల‌కు కూడా బోర్డు షెడ్యూల్‌లో తేదీలు ప్ర‌క‌టించింది. ఇంగ్లీష్ ప్రాక్టిక‌ల్స్ ప‌రీక్ష‌లు ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు జ‌న‌వ‌రి 29న‌, సెకండ్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు జ‌న‌వ‌రి 30న నిర్వ‌హిస్తారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ప‌రీక్ష‌ను జనవరి 29న నిర్వ‌హిస్తారు. ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ ప‌రీక్ష జనవరి 27న నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష‌లు (Telangana Inter Exams) ఇంట‌ర్ ఒకేష‌న‌ల్ కోర్సుల విద్యార్థుల‌కు కూడా వ‌ర్తిస్తాయ‌ని బోర్డు షెడ్యూల్‌లో స్ప‌ష్టం చేసింది. అయితే ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన పూర్తి టైమ్‌టేబుల్‌ను మ‌రోసారి ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు.

Also Read : రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై అధిష్ఠానం సీరియస్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>