అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు.. అధికారులకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదేశాలు!

కలం, ఇచ్చోడ: ఇచ్చోడ (Ichoda) మండల కేంద్రంలోని ప్రధాన రహదారి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఇచ్చోడ ప్రధాన రహదారిని స్వయంగా పరిశీలించి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రహదారి నిర్మాణంతో పాటు డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, మిగిలిన లింక్ రోడ్లు, సీసీ రోడ్ల పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఇచ్చోడ ప్రధాన రహదారి అభివృద్ధి కోసం రూ.13 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన హయాంలో ప్రారంభించిన తొలి రహదారి అభివృద్ధి పనులు ఇవేనని తెలిపారు. ఇప్పటికే సుమారు 50 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇచ్చోడ పట్టణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడంతో పాటు డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, లింక్ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. పనుల్లో జాప్యం జరగకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>