కలం, కరీంనగర్ : భారత తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరా గాంధీ (Indira Gandhi) జయంతి వేడుకలను గురువారం కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ‘ఇందిరా గాంధీ జీవిత బీమా’ పథకం బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా బీమా పథకం..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీ ‘గరీబీ హటావో’ నినాదంతో పేదరిక నిర్మూలనకు, 20 సూత్రాల పథకంతో దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా రాష్ట్రంలోని 1.18 కోట్ల కుటుంబాలకు ‘ఇందిరా గాంధీ జీవిత బీమా’ వర్తింపజేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో జన్మించిన ప్రతి కుటుంబ పెద్దకు (సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే) ఈ బీమా రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు.
5 లక్షల మందికి చేయూత పెన్షన్లు..
ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులు కలిపి సుమారు 5 లక్షల మందికి నేటి నుంచే నూతన చేయూత పెన్షన్లు అందిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.
బీఆర్ఎస్ పాలన పూర్తిగా విఫలం..
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో పూర్తిగా విఫలమైందని కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ విమర్శించారు. నేడు దేశమంతా ఇందిరమ్మ రాజ్యం కోసం ఎదురుచూస్తోందని, కాంగ్రెస్ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎండీ తాజ్, మడుపు మోహన్, కర్ర సత్య ప్రసన్న రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, గడ్డం విలాస్ రెడ్డి, పత్తి మధుకర్ రెడ్డి, వెన్న రాజమల్లయ్య, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సిరిపురం లావణ్య, బాలబద్రి శంకర్, ఇక్రమ్, పడాల అజయ్, వరాల నర్సింగం, అహమ్మద్ అలీ, వెన్నం రజిత రెడ్డి, వంగల విద్యాసాగర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్ రహమాన్, మాదాసు శ్రీనివాస్, దన్నా సింగ్, సరిల్లా రతన్ రాజు, కుంభాల రాజు కుమార్, మూల జైపాల్, పొన్నం మధు, అనంతుల రమేష్, చింతల కిషన్, బొబ్బిలి విక్టర్, నిహాల్, చర్ల పద్మ, అమీర్, వీర దేవేందర్, మిరియాల శ్రీధర్ రెడ్డి, గడప శ్రీనివాస్, కర్రె పావని, వసీం, మంద మహేష్, షబానా మహమ్మద్, గాండ్ల అంజయ్య, కలిముద్దీన్, లాయక్, ఇమ్రాన్ గని, మల్లారెడ్డి, శిల్ప, పెంట శేఖర్, హస్తపురం తిరుమల, సత్రం శ్రీకాంత్, పొన్నాల రాజేష్, సింగిరెడ్డి రాంరెడ్డి, అబ్దుల్ బారి, నాగుల సతీష్, మార్కరాజు, బషీరుద్దీన్, శ్రీనివాస్ రెడ్డి, మాలోతు మహాలక్ష్మి, దండి రవీందర్, జి.ఎస్. ఆనంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

