జమ్మలమడుగులో షాకింగ్ ఘటన.. సొంత ఇంటికి నిప్పంటించిన కొడుకు!

కలం, వెబ్ డెస్క్: తమ్ముడికి పెళ్లి చేసి తనకు చేయలేదన్న కక్షతో ఓ పెద్ద కొడుకు తన సొంత ఇంటికే నిప్పు పెట్టిన ఘటన కడప జిల్లా జమ్మలమడుగు (Jammalamadugu) మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని గూడెంచెరువు రాజీవ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. చిన్నకొడుకుకు తల్లి పెళ్లి చేయడంతో, తనకు చేయలేదనే కోపంతో పెద్ద కొడుకు నరేంద్ర ఆగ్రహానికి గురయ్యాడు.

ఈ విషయమై తరచూ తల్లితో గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలోనే తల్లి ఇంట్లో లేని సమయం చూసి సురేంద్ర ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పింది. కానీ మంటల ధాటికి ఇంట్లోని సామాగ్రి అంతా కాలి బూడిదైంది.

మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కన్నతల్లిపై కోపంతో కట్టుకున్న ఇంటినే బూడిద చేసిన కొడుకు తీరుపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>