కొత్తగూడెంలో మున్సిపల్ కార్మికుల ధర్నా

కలం, ఖమ్మం బ్యూరో: మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, పర్మినెంట్ చేసేంతవరకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని సీపీఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ (AITUC) అనుబంధ తెలంగాణ మున్సిపల్ స్టాఫ్ అండ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం (Kothagudem) మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా (Municipal Workers Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో నంబర్ 1181ని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ, పాలకులు కార్మికుల డిమాండ్లను విస్మరిస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

​కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా నేరుగా వేతనాలు ఇవ్వాలని, ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే. ఏసురత్నం డిమాండ్ చేశారు. అలాగే, పదవీ విరమణ పొందిన కార్మికులకు రూ.10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ అందించాలని, కుటుంబంలో ఒకరికి వారసత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.30 వేలు చెల్లించాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జైపాల్ రెడ్డి కోరారు.

​ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గెద్దాడు నగేష్, జిల్లా నాయకులు భూక్య శ్రీనివాస్, కార్పొరేటర్లు బోయిన విజయ్ కుమార్, గుర్రం వెంకటేశ్వర్లు, కూరపాటి సుధాకర్, పలువురు నాయకులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>