కలం, ఖమ్మం బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్లో మావోయిస్టుల (Maoists) కదలికలను అడ్డుకోవడానికి భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా బీజాపూర్ జిల్లాలోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారి కాంకేర్ అడవిలో బుధవారం భద్రతా దళాలు మరో 50 బ్యారెల్ గ్రేనేడ్ లాంచర్ సెల్స్ (BGL Cells)ను స్వాధీనం చేసుకున్నాయి.
ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూజారికంకేర్ అడవిలో మావోయిస్టుల డంప్ ఉందనే పక్కా సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ గాలింపు చర్యల్లో ఉసూర్, అవపల్లి, పామేడ్ పోలీస్ స్టేషన్ల పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ 196వ బెటాలియన్‌కు చెందిన సంయుక్త బలగాలు పాల్గొని ఈ భారీ ఆయుధాలను వెలికితీశాయి. కాగా, ఇటీవల తెలంగాణ పోలీసులు బీజాపూర్ జిల్లాలోని పూజారుకాంకేర్ సమీపంలోని కర్రె గుట్టల అడవుల్లో 280 బీజీఎల్ సెల్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

