సంగారెడ్డిలో మోడిఫైడ్‌ సైలెన్సర్లకు చెక్‌

కలం, మెదక్ బ్యూరో: ద్విచక్ర వాహనాలకు కంపెనీ అమర్చిన సైలెన్సర్లను తొలగించి, అధిక శబ్దాలు వచ్చే మోడిఫైడ్ సైలెన్సర్లను (Modified Bike Silencers) అమర్చుకుని రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ (Sangareddy Police) ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు సంగారెడ్డి పట్టణంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో మోడిఫైడ్ సైలెన్సర్లను వినియోగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న సుమారు 200 ద్విచక్ర వాహనాలను గుర్తించి, మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు. ఆయా వాహనాలకు అమర్చిన మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సుమారు 200 సైలెన్సర్లను ఈ రోజు రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా డీఎస్పీ సత్యయ్య గౌడ్ మాట్లాడుతూ.. వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చుకుని పెద్ద శబ్దాలతో రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించడం సహించేది లేదని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను గుర్తించి సైలెన్సర్లను తొలగించడంతో పాటు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ రెడ్డి, రూరల్ సీఐ నయీముద్దీన్, టౌన్ సీఐ రాము నాయుడు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>