రామ్ మఠం భూముల్లో బస్ డిపో.. రైతుల ఆందోళన

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యాల్కల్ రోడ్డులో ఉన్న రామ్ మఠానికి చెందిన భూముల్లో (Ram Matam Lands) బస్ డిపో నిర్మాణానికి RTC రెవెన్యూ అధికారులు సర్వే చేస్తుండడాన్ని రైతులు తీవ్రంగా (Nizamabad Farmers Protest) వ్యతిరేకించారు.. RTC రెవెన్యూ అధికారులు భూమిని కొలవడానికి రాగా, సమాచారం తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకొని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. “గత 100 ఏళ్లకు పైగా మఠానికి ఎకరానికి 5 వేల రూపాయలు కౌలు చెల్లిస్తూ తాము ఈ భూములను సాగు చేసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

ఎస్సీ, బీసీ ఇతర కులాలకు చెందిన భూమిలేని రైతులు 140 ఏళ్లుగా ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని తెలిపారు. “ఇప్పుడు ఉన్నట్లుండి మా భూములను లాక్కొని బస్ డిపో పెడతామంటే మా పొట్ట కొట్టినట్టే. రైతుల నోట్లో మట్టి కొట్టొద్దు” అని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్యాల నర్సారెడ్డి, ఆకుల శ్రీనివాస్, కొత్త రవి, సంపత్, శుభం చందు, బగ్గాలి శివ, బగాలి రాజు, గుప్త రవి, కొత్త రవి, అంబదాస్ రావు, లింగం, శివ కుమార్* తదితరులు పాల్గొని ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>