కలం, వెబ్‌డెస్క్: సినీ నిర్మాత బండ్ల గణేశ్ (Bandla Ganesh)కు ఒంగోలు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఆయనకు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమాన విధించింది. మద్దిరాలపాడుకి చెందిన జట్టి వెంకటేశ్వర రావుకు బండ్ల గణేశ్ రూ.95 లక్షలు బాకీ ఉన్నారు. వెంకటేశ్వర రావు డబ్బుల కోసం పదే పదే అడగడంతో బండ్ల గణేశ్ ఆయనకు ఓ చెక్ ఇచ్చారు.
అయితే ఇది తన సొంత ఖాతా నుంచి కాకుండా తన ప్రొడక్షన్ హౌస్ పరమేశ్వర ఆర్ట్స్ తరఫున ఇచ్చారు. అయితే ఈ చెక్ బౌన్స్ అయ్యింది. దీంతో వెంకటేశ్వర రావు ఒంగోలు కోర్టు(Ongole Court)ను ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు బండ్ల గణేశ్(Bandla Ganesh)కు ఏడాది పాటు జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Also Read : జగన్ కేసులో ఈడీ మరో చార్జ్‌షీట్
Follow Us On : WhatsApp

