కలం, వెబ్ డెస్క్: ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ (Vemulawada Temple) విస్తరణ పనులపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. అభివృద్ధి పేరుతో హిందువుల ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో ఆలయ విమాన గోపుర విస్తరణ పనులపై ఆలయ పండితులు, అర్చకులు వివరణ ఇచ్చారు.
ఆగమ శాస్త్ర పండితులు, స్థపతులు, శృంగేరి పీఠాధిపతుల సూచనల మేరకే ఆలయ (Vemulawada Temple) గోపురాన్ని శిలామయంగా మరింత ఎత్తుగా నిర్మిస్తున్నట్లు పండితులు వెల్లడించారు. విస్తరణ పనుల్లో గర్భాలయం, మూలవిరాట్లు, గర్భగృహంలో ఎలాంటి మార్పులు ఉండవని.. అవి పూర్తిగా సురక్షితంగా ఉంటాయని వారు స్పష్టం చేశారు. అన్ని దిశల నుంచి దర్శనం కలిగేలా గోపుర పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. బయట వస్తున్న వదంతులను, పుకార్లను నమ్మవద్దని భక్తులకు అర్చకులు సూచించారు.

