త‌రుణ్ భాస్క‌ర్-ఈషా రెబ్బ రిలేషన్​ పై అఫిషియల్​ ప్రకటన!

కలం, సినిమా: టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker), హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) మధ్య ఉన్న బంధంపై కొంతకాలంగా సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ సినిమాకు సంబంధించింది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తరుణ్ భాస్కర్, ఆయన తల్లి గీత భాస్కర్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్-ఈషా రిలేషన్ పై గీత భాస్కర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఆమె చేసిన నర్మగర్భ వ్యాఖ్యలతో వీరిద్దరి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరినట్లు నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు.

రెండేళ్లలో తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న సమయంలో ఈషా రెబ్బ తనకు అండగా నిలిచిందని గీత భాస్కర్ చెప్పారు. రాత్రిపూట 2, 4 గంటలకు ఇంటికివచ్చినా భోజనం పెట్టడానికి మంచి సోల్ మేట్ దొరికిందని చెప్పారు. ఈషా మంచి ఫ్రెండ్ మాత్రమే కాదని.. సోల్ మేట్ అని స్పష్టం చేశారు. దీంతో ఈషా-తరుణ్ భాస్కర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలకు బలం చేకూరింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>