జమ్మూకాశ్మీర్​లో ఎన్​ కౌంటర్​.. లష్కరే తోయిబా టాప్​ కమాండర్ హతం

కలం, వెబ్​ డెస్క్​: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో జరిగిన ఎన్​ కౌంటర్ (Kulgam Encounter)​ ఉగ్రవాది మరణించాడు. బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన తాజా ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబా అగ్ర కమాండర్ లతీఫ్ భట్ హతమయినట్లు తెలుస్తోంది. నవంబర్‌ 11న సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) చెక్‌పాయింట్‌పై జరిగిన దాడికి లతీఫ్‌ భట్‌ సూత్రధారిగా వ్యవహరించినట్లు భద్రతా వర్గాలు అనుమానించాయి.

ఈ నేపథ్యంలో అతడిని పట్టుకునేందుకు భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భట్‌కు భద్రతా అధికారులు లొంగిపోవాలని కోరినట్లు సమాచారం. అయతే, లొంగిపోవడానికి ఉగ్రవాది నిరాకరించడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆపరేషన్​ లో భాగంగా బుధవారం తెల్లవారుజామున మరోసారి చోటు చేసుకున్న ఎదురుకాల్పుల్లో (Kulgam Encounter) లతీఫ్‌ భట్‌ హతమయ్యాడు. ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>