గుర్నూర్‌ భరార్‌కు డీమెరిట్ పాయింట్!

క‌లం, స్పోర్ట్స్: న్యూజిలాండ్‌ బ్యాటర్‌ వికెట్‌ తీసిన ఆనందంలో హద్దులు దాటిన భారత పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌ (Gurunoor Brar)కు ఐసీసీ మందలింపు జారీ చేసింది. నాలుగో వన్డేలో టిమ్‌ సీఫర్ట్‌ ఔటైన తర్వాత గుర్నూర్‌ చేసిన దూకుడు సంబరాలపై చర్యలు తీసుకుంది. అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ కూడా జత చేసింది. మౌంట్‌ మాంగనూయ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో 12వ ఓవర్‌ చివర్లో సీఫర్ట్‌ వికెట్‌ పడింది.

ఆ సమయంలో గుర్నూర్‌ చేసిన సంబరాలు బ్యాటర్‌ను కించపరిచేలా, అతడిని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఐసీసీ భావించింది. దీంతో ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.5 కింద అతడిని దోషిగా తేల్చింది. గత 24 నెలల్లో గుర్నూర్‌కు ఇది రెండో తప్పిదం. దీంతో అతడి ఖాతాలో మొత్తం రెండు డీమెరిట్‌ పాయింట్లు చేరాయి. తన తప్పును అంగీకరించిన గుర్నూర్‌.. మ్యాచ్‌ రిఫరీ రంజన్‌ మదుగల్లే విధించిన శిక్షను అంగీకరించాడు. దీంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే చర్యలు పూర్తయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>