క‌ర్ణాట‌క టెంపుల్‌లో ప్ర‌భాస్ పూజ‌లు!

క‌లం, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ (Prabhas) వ‌రుస సినిమా షూటింగుల‌తో బిజీబిజీగా ఉన్నారు. ఇంత బిజీ టైంలో ప్ర‌భాస్ ఓ ఆల‌యాన్ని ద‌ర్శించ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కటీల్‌ దుర్గాపరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని ప్రభాస్ మంగ‌ళ‌వారం సందర్శించారు. మంగళూరుకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. సౌత్ ఇండియాలోని ప్రముఖ శక్తి పీఠాల్లో ఒకటిగా పేరొందిన ఈ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అమ్మవారి దర్శనం కోసం ప్రభాస్‌ ఆలయానికి వెళ్లినట్లు సమాచారం.

ప్రభాస్‌ ఆలయ సందర్శన వార్త ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమ అభిమాన హీరో అమ్మవారి దర్శనం చేసుకోవడంపై ఫ్యాన్స్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించిన ప్రభాస్‌.. తాజాగా కటీల్‌ దుర్గాపరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొంద‌రు త‌న సినిమాలు హిట్ అవ్వాల‌ని పూజ‌లు చేశార‌ని, మ‌రికొంద‌రు పెళ్లి గురించే పూజ‌లు చేసి ఉంటాడ‌ని చ‌ర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>