తెలంగాణ పోలీస్ శాఖలో నిరీక్షణకు తెర.. డీజీపీ సంచలన నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ పోలీస్ శాఖలో (Telangana Police) సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. సీనియారిటీ వివాదాలు, న్యాయపరమైన చిక్కులను పరిష్కరించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా డీజీపీ కార్యాలయంలో 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన ఎస్‌ఐ ( ప్రస్తుత డీఎస్పీ స్థాయి) అధికారులతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే రోస్టర్ పాయింట్లు, సర్వీసు కాలం, కంఠారావు కమిటీ నివేదిక తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ప్రతిపాదిత జాబితాలపై అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

ఈ నిర్ణయాల ప్రకారం.. తొలి విడతలో భాగంగా 54 మంది అర్హులైన డీఎస్పీలకు తక్షణమే అదనపు ఎస్పీ హోదా కల్పించనున్నారు. 2027 ఆగస్టు నాటికి మరో 34 పోస్టులు భర్తీ చేయనున్నారు. అలాగే ఎలాంటి కోర్టు కేసులు లేని 12 మంది అదనపు ఎస్పీలకు వెంటనే నాన్‌-క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని, ప్రస్తుత ప్యానెల్ ఇయర్‌లో మరో 10 నాన్‌-క్యాడర్ ఎస్పీ పోస్టులను కేటాయించాలని నిర్ణయించారు. కోర్టు వివాదాల వల్ల పదవీ విరమణకు దగ్గరలో ఉన్న అధికారులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, త్వరలోనే ఈ ఏకాభిప్రాయ ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు వెలువడేలా చూస్తామని డీజీపీ సీవీ ఆనంద్ భరోసా ఇచ్చారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>