కలం, సినిమా: వండర్‌బార్ ఫిల్మ్స్, ఆర్ టేక్ స్టూడియోస్ బ్యానర్లపై శ్రద్దా అగర్వాల్ నిర్మాణంలో ధనుష్ (Dhanush), మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన చిత్రం ‘ఓం ఛాప్టర్ 1 – రుధిరం: ది బ్లడ్ వుడ్’. ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నవంబర్ 20న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మూవీలో నటించిన స్టార్స్ అందరూ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మమ్ముట్టి మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చెప్పారు. తనకు మొదట హెల్త్ సహకరించకపోవడంతో షూటింగ్ కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేయాలని డైరెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ సినిమా కోసం దర్శకుడు, ధనుష్, రేణు దేశాయ్, సాయి పల్లవితో పాటు సాంకేతిక బృందం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారన్నారు. వీళ్లందరితో కలిసి పనిచేయడం చాలా సరదాగా అనిపించిందని చెప్పారు. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ధనుష్ మాట్లాడుతూ* .. ‘‘ఓం’ సినిమాలో చాలా పాత్రలు తెలుగులోనే మాట్లాడతాయి. దాదాపుగా ఇది ద్విభాషా చిత్రం. తిరుపతి, తిరుమల, తిరువణ్ణామలై వంటి రెండు పుణ్యక్షేత్రాల నేపథ్యంలో సాగే ఈ కథలో తెరపై కనిపించే అంశాల కంటే చాలా లోతైన భావాలు దాగి ఉన్నాయి. సినిమాలో నటించిన తెలుగు నటీనటులందరూ కూడా అద్భుతంగా నటించారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తారు. ఇక్కడ మంచి చిత్రాలను సెలెబ్రేట్ చేస్తుంటారు. అలా ఆడియెన్స్ అందరూ సెలెబ్రేట్ చేసుకునేలా ‘ఓం’ చిత్రం ఉంటుంది. ‘ఓం’ సినిమా అందరికీ నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
సాయిపల్లవి మాట్లాడుతూ .. ఈ సినిమాలో తాను తొలిసారి ఐపీఎస్ అధికారిణి పాత్రలో నటించినట్లు చెప్పారు. ఇక మమ్ముట్టితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమన్నారు. శ్రీలీల మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది. నా మెడిసిన్ పూర్తయిన తర్వాత ముంబైలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో నాకు కొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ నేను అప్పుడు రెడీగా లేను. అదే సమయంలో ఈ సినిమా కథ విన్నాను. నాకు కథ చాలా బాగా నచ్చింది. దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామికి ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని చెప్పారు. రేణు దేశాయ్ మాట్లాడుతూ.. ‘మమ్ముట్టి గారి ముందు నిలబడి మాట్లాడాలంటే నిజంగా మాటలు రావడం లేదు. ఈ సినిమా గురించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ సినిమా ఆఫర్ ఫిబ్రవరిలో వచ్చింది. అప్పుడు మహాశివరాత్రి. ఆ టైమ్‌లో నేను కామాఖ్యలో ఉన్నాను. అప్పుడు నాకు ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అంటే ఇది ఖచ్చితంగా దైవ నిర్ణయమే. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజ్‌కుమార్ హాజరుకాకపోవడం కొంత బాధగా ఉంది. ఆయనను చాలా మిస్ అవుతున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన టీమ్ మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.

