చెత్తబుట్టలో కాంగ్రెస్ మేనిఫెస్టో.. హామీలపై గంగుల నిరసన

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో (Election Manifesto) ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆరోపిస్తూ కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంగుల కమలాకర్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను చింపి చెత్తబుట్టలో వేసి నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>