కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ!

కలం, వెబ్ డెస్క్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు (Chandrababu) కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ , కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో కలిసి కేంద్ర మంత్రిని కలిసిన చంద్రబాబు, రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, ఆర్థిక సాయంపై చర్చించారు. ముఖ్యంగా ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా శంకుస్థాపన చేసిన రూ. లక్ష కోట్ల అంచనా వ్యయంతో కూడిన ‘రాయలసీమ గ్లోబల్ హార్టీకల్చర్ హబ్’ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సిద్ధం చేసిన ప్రతిపాదనలను త్వరగా కార్యరూపంలోకి తీసుకురావడంపై ఇరువురు నేతలు చర్చించారు.

అలాగే ఎల్‌నినో ప్రభావం కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు, ఇటీవల రాష్ట్రాన్ని వరుసగా వణికించిన అర్నాబ్, మురసు తుపాన్ల వల్ల జరిగిన భారీ నష్టాన్ని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. తుపాన్ల బీభత్సం వల్ల పంటలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, బాధితులను ఆదుకునేందుకు, పునర్నిర్మాణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తుపాన్ల నష్టానికి సంబంధించిన సమగ్ర నివేదికలను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>