జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మేడారం అపర్ణ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోమవార్పేట్ కాలనీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు మేడారం అపర్ణ (Medaram Aparna Pradeep) ప్రదీప్ నిర్మల్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా (Mahila Congress President) నియమితులయ్యారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చేతుల మీదుగా ఆమె నియామక పత్రాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తగా, కౌన్సిలర్‌గా, బీసీ మహిళా నాయకురాలిగా అపర్ణ అందిస్తున్న సేవలను గుర్తించి పార్టీ అధిష్ఠానం జిల్లా బాధ్యతలు అప్పగించింది.

ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ.. జిల్లాలో మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తూ, మహిళా నాయకులు, కార్యకర్తలను ఐక్యంగా ముందుకు నడిపిస్తానని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించేందుకు సహకరించిన జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి, ఇతర సీనియర్ నాయకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>