ఐపీఎల్ ట్రేడ్‌ డీల్స్‌లో కీలక మార్పులు.. ఆటగాళ్లపై శ్రీకాంత్ కామెంట్స్!

కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ ట్రేడ్ డీల్స్ (IPL Trade Deals) వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్‌పై మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Krishnamachari Srikkanth) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉనద్కత్‌ను హైదరాబాద్ ఇంకా జట్టులో ఉంచుకోవడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2025 వేలంలో 8 కోట్ల రూపాయలకు హైదరాబాద్ కొనుగోలు చేసిన హర్షల్ పటేల్, ఆ సీజన్‌లో 13 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీశాడు. కానీ 2026 సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో ప్రస్తుతం అతడు రూ. 4 కోట్లకు గుజరాత్ టైటాన్స్‌కు ట్రేడ్ కానున్నాడు.

మరోవైపు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ రాకతో ఉనద్కత్‌కు తుది జట్టులో అవకాశాలు లేకుండా పోయాయి. అయినా పాత ఆటగాడనే కారణంతో ఉనద్కత్‌ను జట్టులో ఉంచుకున్నారని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్‌లో విమర్శించారు. గుజరాత్ జట్టులో కూడా హర్షల్‌కు తుది జట్టులో చోటు కష్టమేనని, కేవలం గాయపడిన ఆటగాళ్ల స్థానంలో వాడుకోవడానికే తీసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. జీషన్ అన్సారీ స్థానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మారిన టీ నటరాజన్‌పైనా శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు.

నటరాజన్ కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడని, మిగతా సమయాల్లో ఫిట్‌నెస్ పేరుతో తప్పించుకుంటున్నాడని ఆరోపించారు. ఇది సాధారణ క్రికెటర్లకు మంచి సంకేతం కాదన్నారు. మరో ట్రేడ్ డీల్‌లో లక్నో పేసర్ మహ్మద్ షమీ, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ స్థానంలో రాజస్థాన్ రాయల్స్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఈ డీల్ జరిగితే జోఫ్రా ఆర్చర్‌తో కలిసి 36 ఏళ్ల షమీ బౌలింగ్ చేయనున్నాడు. గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచిన లక్నో జట్టులో షమీ మార్పు ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>