సమ్మె చేస్తున్నా పట్టించుకోరా?.. బీడీ కార్మికుల ఆందోళన

కలం, నర్సాపూర్ (జి): బీడీ కార్మికులకు నెలకు కనీసం 26 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నర్సాపూర్ (జి) (Narsapur G) మండలం రాంపూర్ గ్రామంలోని శివాజీ (సంబాజీ) బీడీ హెడ్ ఆఫీస్ ఎదుట కార్మికులు ధర్నా (Beedi Workers Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. పని దినాలు పెంచాలని కోరుతూ ఈ నెల 9వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నెలకు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే పని కల్పిస్తుండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. మరోవైపు నాణ్యమైన ఆకు, పొగాకు సరఫరా చేయకుండా బీడీలు తయారు చేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బీడీ తయారీనే జీవనాధారంగా చేసుకున్న తమకు ఇతర పనులు తెలియవని, పరిశ్రమలో ఉపాధి తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. మహారాష్ట్రలో శివాజీ బీడీ యాజమాన్యం కార్మికులకు నెలకు 26 రోజుల పని కల్పిస్తున్న విధంగానే తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యాజమాన్య కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>