పైకొక‌టి.. లోప‌లొక‌టి.. హైద‌రాబాద్‌లో క‌ల్తీ లిక్క‌ర్‌..!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌రో భారీ మ‌ద్యం స్కామ్ (Fake Liquor) వెలుగులోకి వ‌చ్చింది. కాస్ట్లీ బాటిళ్ల‌లో చీప్ లిక్క‌ర్ నింపి అమ్మ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. శంషాబాద్‌లోని శాతంరాయిలో ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వంగ‌లి అశోక్ అనే వ్య‌క్తి ఖ‌రీదైన మందు సీసాల్లో చీప్ లిక్క‌ర్ నింపి బ‌య‌ట అమ్మ‌కాలు చేప‌డుతున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇత‌డికి మ‌హ‌మ్మ‌ద్ యాకూబ్ పాషా అనే మ‌రో వ్య‌క్తి స‌హ‌క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. యాకూబ్ పాషాకు ఒక స్క్రాప్ దుకాణం ఉంది. ఈ షాప్ నుంచి ఖ‌రీదైన మ‌ద్యం బాటిళ్లు అశోక్‌కు పంపిస్తున్నాడు. అశోక్ వీటితో న‌కిలీ మ‌ద్యం దందా సాగిస్తున్నాడు.

ముందుగా ఆ మ‌ద్యం బాటిళ్ల‌ను శుభ్రంగా క‌డిగి, త‌ర్వాత రూ.560 విలువ చేసే చీప్ లిక్క‌ర్ నింపి అమ్ముతున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డైంది. కానిస్టేబుల్ ధ‌నుంజ‌య్ ముందుగా ఈ న‌కిలీ మ‌ద్యాన్ని గుర్తించారు. దీనిపై సీఐకి స‌మాచారం ఇవ్వ‌డంతో అశోక్ ఇంట్లో సోదాలు నిర్వ‌హించారు. పోలీసుల సోదాల్లో ప‌ది ఫుల్ బాటిల్స్‌, న‌కిలీ మ‌ద్యం నింపిన బాటిల్‌తో పాటు, మ‌రో 30కి పైగా ఖాళీ సీసాలు ల‌భ్య‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం అశోక్‌తో పాటు యాకూబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క‌ల్తీ మ‌ద్యం దందా వెనుక వీరిద్ద‌రే ఉన్నారా? మ‌రెవ‌రైనా దీన్ని న‌డిపిస్తున్నారా? అనే కోణంలో విచార‌ణ జ‌రుపుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>