ఐపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్‌.. ధోని కీల‌క నిర్ణ‌యం!

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్ క్రికెట్ ల‌వ‌ర్స్‌కు షాకిస్తూ స్టార్ క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఐపీఎల్‌ (IPL)కు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ప్ర‌క‌టించారు. అయితే సీఎస్‌కే (CSK) కు ధోనీ మెంటార్‌గా కొన‌సాగ‌నున్నారు. ధోనీ కెప్టెన్సీలో చెన్నై ఐదు ట్రోఫీలు గెలుచుకుంది. ధోనీ రిటైర్మెంట్ సంద‌ర్భంగా సీఎస్‌కే భావోద్వేగ సందేశాన్ని అందించింది.

ఈ సంద‌ర్భంగా చెన్నై సూప‌ర్ కింగ్స్ అధినేత శ్రీనివాస‌న్‌ ధోనీతో త‌మ‌కున్న అనుబంధాన్ని భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. దాదాపు రెండు ద‌శాబ్దాలుగా ధోనీతో క‌లిసి ఎన్నో విజ‌యాలు, అప‌జ‌యాలు ఎదుర్కొంటూ ప్ర‌యాణం సాగించామ‌ని తెలిపారు. 2008లో ధోనీని సీఎస్‌కే జ‌ట్టులోకి తీసుకోవాల‌ని తాను ప‌ట్టుబ‌ట్టిన‌ట్లు చెప్పారు. అది త‌న జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిష‌న్ అని వెల్ల‌డించారు. ధోనీ సాధించిన విజ‌యాలే కాకుండా, ఆయ‌న వ్య‌క్తిత్వం కూడా ఎంతో గొప్ప‌ద‌ని ప్ర‌శంసించారు. ధోనీ ఎప్ప‌టికీ సీఎస్‌కే గుర్తింపులో భాగంగానే ఉంటార‌ని, ఆ జ‌ట్టు ఎల్ల‌ప్పుడూ ఆయ‌న‌కు సొంత ఇంటి లాంటిద‌ని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>