కలం, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని షాద్రా జిల్లా వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కస్తూర్బా నగర్ (జ్వాలా నగర్) ప్రాంతంలో సుమారు 40 నుంచి 50 ఏళ్ల నాటి రెండంతస్థుల పురాతన భవనం కుప్పకూలింది (Delhi Building Collapse). ఇంటి పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో లోపల ఉన్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో మూడు నెలల పసికందుతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, అంబులెన్స్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న 7 నుంచి 8 మందిని సురక్షితంగా బయటకు తీశారు. ఇంకా మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

