ఉలిక్కి పడిన కోనసీమ.. మామిడికుదురులో ఓఎన్జీసీ గ్యాస్​ లీక్​

కలం, వెబ్​ డెస్క్​: ఆంధ్రప్రదేశ్​ లో మరోసారి బ్లో అవుట్​ కలకలం రేపింది. అంబేద్కర్​ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో మంగళవారం ఉదయం ఓఎన్జీసీ రిగ్​ నుంచి గ్యాస్​ లీక్ (ONGC Gas Blowout) అయింది. నగరం తాడివారి పుంతలో రీ డ్రిల్లింగ్​ చేస్తుండగా భారీ శబ్ధంలో గ్యాస్​ వెలువడింది. పాత రిగ్​ వద్ద డీప్​ ఇండస్ట్రీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ రీ డ్రిల్లింగ్​ చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. భారీగా గ్యాస్ లీక్ అవుతుండడంతో అధికారులు సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు.

బ్లో అవుట్ (ONGC Gas Blowout)​ ను అదుపులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే, ఒక్కసారిగా భారీ శబ్ధంతో గ్యాస్ వ్యాపిస్తుండడంతో చుట్టు పక్కల ప్రజలు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది అటువైపు ప్రజలు రాకుండా చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న హైవేపైకి రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.

కాగా, 2014లో కోనసీమలో వాసుల మదిలో గ్యాస్​ లీక్​ కావడంతో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే, ఈ ఏడాది జనవరి 5న ఇరుసుమండ గ్రామంలో డ్రిల్లింగ్​ పనులు నిర్వహిస్తుండగా భారీ బ్లో అవుట్ జరిగింది. ఇలా కోనసీమలో వరుసగా గ్యాస్ లీకేజీ ఘటనలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>