నిన్న మైక్రోసాఫ్ట్.. నేడు బ్యాంకులు : అమెరికాలో ఏం జరుగుతోంది!

కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని పలు ప్రముఖ బ్యాంకుల సాంకేతిక సర్వర్లు ఒక్కసారిగా మొరాయించడంతో డిజిటల్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం (US Banks Outage) ఏర్పడింది. జేపీ మోర్గాన్ చేజ్ (JPMorgan Chase), బ్యాంక్ ఆఫ్ అమెరికా (Bank of America), వెల్స్ ఫార్గో (Wells Fargo), ట్రూయిస్ట్ (Truist), యూఎస్ బ్యాంక్ (U.S. Bank) వంటి ప్రధాన ఆర్థిక సంస్థల ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి. దీనికి తోడు ప్రముఖ డిజిటల్ పేమెంట్ యాప్ జెల్లే (Zelle) నెట్‌వర్క్ కూడా పనిచేయకపోవడంతో నగదు బదిలీలు ఆగిపోయాయి.

మధ్యాహ్నం సమయానికి ఒక్క చేజ్ బ్యాంక్ నుంచే సుమారు 4,500 మందికి పైగా ఖాతాదారులు సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేశారు. లావాదేవీలు ఆలస్యమవుతున్న విషయాన్ని ధ్రువీకరించిన చేజ్ బ్యాంక్, కేవలం సిస్టమ్ బగ్ వల్లే ఈ అంతరాయం కలిగిందని స్పష్టం చేసింది. ఖాతాదారుల నగదుకు ఎటువంటి ఢోకా లేదని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని బ్యాంక్ యాజమాన్యం పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ (Microsoft) సర్వర్లలో భారీ అంతరాయం ఏర్పడిన కొద్ది రోజులకే, అమెరికాలోని అగ్రశ్రేణి బ్యాంకులన్నీ ఒకేసారి సాంకేతిక సమస్యలను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది సైబర్ దాడి కాదని, కేవలం సాంకేతిక లోపం మాత్రమేనని చేజ్ బ్యాంక్ తేల్చి చెప్పింది. మైక్రోసాఫ్ట్ ఘటనకు, ప్రస్తుత బ్యాంకింగ్ సర్వర్ల డౌన్‌కు ఎటువంటి సంబంధం లేదని అధికారికంగా పేర్కొన్నప్పటికీ, వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు ఖాతాదారుల్లో పలు సందేహాలకు తావిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>