వైరా కమ్మ సంఘం సేవా కార్యక్రమాలకు పువ్వాడ పిలుపు

కలం, వైరా : సమాజంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని, వారందరినీ కలుపుకుని పోయే ‘ఇరుసు’లా కమ్మ కమ్యూనిటీ ఉండాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆకాంక్షించారు. ఆదివారం ఖమ్మం జిల్లా వైరా (Wyra) కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనసమారాధన కార్యక్రమానికి మాజీ పార్లమెంటరీ పార్టీ నాయకులు నామా నాగేశ్వరరావుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వనసమారాధనకు విచ్చేసిన ప్రజలకు పువ్వాడ కార్తీకమాస శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు కమ్మ సామాజిక వర్గం, జిల్లా ప్రజల అండదండలతోనే తాను మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని కృతజ్ఞతలు తెలిపారు. ఎందరో గొప్ప నాయకులను అందించిన ఘన చరిత్ర కలిగిన వైరా కమ్మ సంఘం భవిష్యత్తులో సేవా కార్యక్రమాల్లో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఖమ్మం జిల్లాకు రాజకీయంగానే కాకుండా అన్ని రంగాల్లో ప్రత్యేక స్థానం, గుర్తింపు లభించడానికి కమ్మ సామాజిక వర్గం ప్రధాన కారణమని పువ్వాడ పేర్కొన్నారు.

జనాభా పరంగా, వ్యవహారికంగా చూసినా జిల్లాలో అత్యంత ప్రభావశీలమైన వర్గంగా కమ్మ కమ్యూనిటీ నిలిచిందని అన్నారు. ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో రైతాంగంతో పాటు వ్యాపార, సామాజిక రంగాల్లో కమ్మ సామాజిక వర్గం క్రియాశీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, నేటి తెలంగాణలోనూ కమ్మ కమ్యూనిటీ ఉనికి, నాయకత్వ పటిమ ఎంతో బలంగా ఉన్నాయని కొనియాడారు. ఖమ్మం జిల్లా బిడ్డగా నామా నాగేశ్వరరావు గతంలో రెండుసార్లు ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసి జిల్లా గౌరవాన్ని పెంచారని పువ్వాడ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు సమయంలో నామా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కట్టా కృష్ణార్జున రావు, రమేష్, శేఖర్, నాగేశ్వరరావు, బిక్కసాని జస్వంత్, గొల్లపూడి హరికృష్ణ, మోరంపుడి ప్రసాద్, రాంబాబు తదితరులతో పాటు వైరా కమ్మ సంఘం కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>