బిష్ణోయ్ గ్యాంగ్ ఎఫెక్ట్.. బాలీవుడ్ స్టార్లకు భద్రత పెంపు

కలం, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang) భయపెడుతూనే ఉంది. అక్టోబర్ 18న హీరో టైగర్ ష్రాఫ్ లక్ష్యంగా ఆయన కారుపై కాల్పులు జరిపిన నేపథ్యంలో టార్గెట్ లిస్ట్‌లో ఉన్నవారు మరింత వణికిపోతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై.. తాజాగా హిట్ లిస్ట్‌లో ఉన్నవారికి భద్రతపై సమీక్ష చేసి.. ఇద్దరు స్టార్లకు భద్రతను పెంచినట్లు తెలుస్తోంది. ఒకరి భద్రతను ఎక్స్ కేటగిరీ నుంచి వై కేటగిరి, మరొకరి భద్రతను వై కేటగిరి నుంచి వై ప్లస్ కేటగిరికి మార్చినట్లు సమాచారం.

భద్రతా కారణాల దృష్ట్యా వీరి పేర్లను బయటకు వెల్లడించకపోయినా.. అందులో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్‌ను ఎప్పుడో హిట్ లిస్ట్‌లో చేర్చి.. ఆయనతో సంబంధం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే బాబా సిద్ధిఖీని కాల్చి చంపగా.. తాజాగా టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిపారు.

జాగ్రత్తగా ఉండాల్సిందే..

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అనుచరుల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో హిట్ లిస్ట్‌లో ఉన్నవారే కాకుండా, వారి కుటుంబ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలని ముంబై పోలీసులు హెచ్చరించినట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమ సెక్యూరిటీకి చెప్పకుండా ఒంటరిగా భయటకు వెళ్లొద్దని స్పష్టం చేసినట్లు సమాచారం. స్టార్ కుటుంబ సభ్యులకు కూడా అవసరాన్ని బట్టి భద్రతను కల్పించే అంశాన్ని క్రైం బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు జరిపిన ముగ్గురిని ఇప్పటికే అరెస్ట్ చేసినా.. తరచూ లారెన్స్ గ్యాంగ్ నుంచి డెత్ ఫోన్ కాల్స్ మాత్రం ఆగడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>