ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే ఏలేటి

కలం, దిలావర్ పూర్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centre) రైతులు సద్వినియోగం చేసుకోవాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Maheshwar Reddy) అన్నారు. శుక్రవారం దిలావర్ పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.

రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రహించి ఏ గ్రేడ్ కు రూ.2,461. బీగ్రేడ్ కు రూ.2,441 మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగకుండా చూడాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లర్లకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ముత్యం రెడ్డి, వీరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>