ఏపీలో మంచు మ‌నోజ్ భార్య భారీ పెట్టుబ‌డులు!

క‌లం, వెబ్‌డెస్క్‌: ప్ర‌ముఖ న‌టుడు మంచు మ‌నోజ్ భార్య భూమా మౌనిక (Bhuma Mounika) ఏపీలో పెట్టుబ‌డులు పెట్ట‌నున్నారు. దీనికి సంబంధించి ప్ర‌భుత్వంతో నేడు ఒప్పందం కుదుర్చుకున్నారు. విశాఖపట్నంలో సీఐఐ స‌మ్మిట్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ్మిట్‌లో దేశ విదేశాల నుంచి ప‌లు కంపెనీలు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌ర‌లివ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో భూమా మౌనిక త‌న స్టార్ట‌ప్ న‌మ‌స్తే వ‌ర‌ల్డ్ టాయ్స్ త‌ర‌ఫున ఏపీ ప్ర‌భుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు.

ఈ స్టార్ట‌ప్ గురించి గ‌తంలో సైతం మౌనిక ప్ర‌భుత్వానికి ప్ర‌జెంటేష‌న్ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో మంచు మ‌నోజ్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా మౌనిక రూ.36 కోట్ల‌తో క‌ర్నూలులో ఇండ‌స్ట్రియ‌ల్ యూనిట్ ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిపాదించారు. ఈ యూనిట్ సంప్ర‌దాయ బొమ్మ‌లు, హ‌స్త‌క‌ళా ఉత్ప‌త్తుల ద్వారా భార‌తీయ సంస్కృతిని దేశ విదేశాల్లో ప్ర‌మోట్ చేస్తుంది. రాష్ట్ర అభివృద్ది కోసం వినూత్న ఆలోచ‌న‌తో పెట్టుబ‌డుల‌కు ముందుకు వ‌చ్చిన మ‌నోజ్ దంప‌తుల‌ను ప్ర‌జ‌లు అభినందిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>