దేశంలోనే ముందంజలో ఏపీ.. కేంద్ర మంత్రి ప్రశంసలు !

కలం, వెబ్ డెస్క్ : హరిత ఇంధన (Green Energy) రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) ప్రశంసించారు. విశాఖపట్నంలో ఘనంగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్రంలో సౌర, పునరుత్పాదక ఇంధన రంగాల అభివృద్ధికి రూ. 43,871 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 17 కీలక అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. ‘పీఎం సూర్య ఘర్’ పథకం కింద అత్యంత తక్కువ కాలంలోనే ఏపీలో 7.86 లక్షల ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు.

చంద్రబాబుపై కేంద్ర మంత్రి ప్రశంసల జల్లు

ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు (Chandrababu) దార్శనికత, పాలనా దక్షతపై ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) ప్రత్యేకంగా పొగడ్తల వర్షం కురిపించారు. ”ప్రతి కుటుంబం నుంచి ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్” అనే నినాదంతో గతంలో చంద్రబాబు ఐటీ విద్యకు వేసిన బలమైన పునాదుల వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని గుర్తుచేశారు. తాను విదేశాలకు వెళ్లిన ప్రతిసారీ అక్కడ తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో విజయవంతంగా రాణించడం చూస్తుంటానని, ఆ స్థాయి గుర్తింపు రావడానికి చంద్రబాబు దూరదృష్టే ప్రధాన కారణమని వెల్లడించారు.

ప్రస్తుతం పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ వంటి భవిష్యత్ రంగాల్లోనూ అదే తరహా వేగంతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ భారీ పెట్టుబడుల ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రావడమే కాకుండా, స్థానిక యువతకు వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు.

Also Read : ఏపీలోని అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు: CM చంద్రబాబు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>