మత్తుపదార్థాల నిర్మూలనకు విస్తృత ప్రచారం నిర్వహించాలి: కలెక్టర్ రాజర్షి షా

కలం, ఆదిలాబాద్ : మత్తుపదార్థాల (Drugs) వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించి, మత్తుపదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah) సూచించారు. ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా రూపొందించిన మత్తుపదార్థాల నివారణ ప్రచార పోస్టర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి దుష్ప్రభావాలపై విద్యార్థులు, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డి ఈ ఓ మాధవి, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ మనోహర్ రావు, స్టేట్ ఈసీ మెంబర్ రాజేశ్వరరావు, డైరెక్టర్లు రాజు, బండారి కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>