తెలంగాణలో ఆసుపత్రుల నిర్మాణాలు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)నాటికి హైదరాబాద్ లోని అల్వాల్‌ హాస్పిటల్, ఎల్‌బీ న‌గ‌ర్ టిమ్స్‌, వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి, నిమ్స్ విస్త‌ర‌ణ ప‌నులు పూర్తి కావాల‌ని ఉన్నత వైద్యాధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వ‌చ్చే ఏడాది డిసెంబ‌రు నాటికి నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ ప‌నులు పూర్తి చేయాలన్నారు.

ఈ మేరకు హైదరాబాద్ ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహఎం ఉన్నతాధికారుతో కలిసి సీఎం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. సనత్ నగర్ టిమ్స్‌, వ‌రంగ‌ల్ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి, నిమ్స్ విస్త‌ర‌ణ‌, ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రుల నిర్మాణ ప‌నులు, ఆయా ఆసుప‌త్రులకు (Telangana Hospital Projects) అవ‌స‌ర‌మైన ఎక్విప్ మెంట్ కొనుగోలు, వైద్యులు, సిబ్బంది నియామ‌కాలు ఏక‌కాలంలో పూర్తి కావాలని సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔట్ పేషెంట్ల (OP) సంఖ్య 7 కోట్ల నుంచి 9 కోట్లకు పెర‌గ‌డం.. ఇన్‌పేషెంట్ల (IP) సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెర‌గ‌డంపై ముఖ్య‌మంత్రి సంతృప్తి వ్య‌క్తం చేశారు. మూడేళ్ల‌లోనే వైద్యులు, న‌ర్సులు, ఏఎన్ఎంలు, పారామెడిక‌ల్ సిబ్బంది క‌లిపి 13,401 నియామ‌కాలు పూర్తి చేశామ‌ని తెలిపారు. మ‌రో 5,640 నియామ‌కాల ప్ర‌క్రియ కొనసాగుతోంద‌న్నారు.

ప్ర‌భుత్వ ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను 30 వేల నుంచి 38 వేలకు పెంచామ‌ని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య చికిత్సల కవరేజీని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచమని గుర్తు చేశారు. స‌న‌త్‌న‌గ‌ర్‌, అల్వాల్‌, ఎల్‌బీ న‌గ‌ర్ టిమ్స్‌ల్లో వైద్యులు, ఇత‌ర సిబ్బంది నియామ‌కాల‌కు సంబంధించి ఏకీకృత విధానంలో చేపట్టాలని ఆదేశించారు. సేవలు నిర్విరాటంకంగా జరిగేందుకు 3 టిమ్స్‌ల మధ్య వైద్యులు, సిబ్బంది బదిలీలు జరిగేలా ఉండాలన్నారు. నిమ్స్‌లో శ‌స్త్రచికిత్స‌ల‌కు స‌మ‌యం ఎక్కువ తీసుకుంటున్నందున స‌న‌త్‌న‌గ‌ర్ టిమ్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించాల‌ని ఆదేశించారు.

టిమ్స్‌లో వైద్యుల నియామ‌కం పూర్త‌య్యే వ‌ర‌కు బ‌య‌టి నుంచి వైద్యులను నియమించుకోవాల‌ని, అందుకు అవ‌స‌ర‌మ‌య్యే మొత్తాన్ని వెంట‌నే విడుద‌ల చేస్తామ‌ని ముఖ్యమంత్రి తెలిపారు. అధికారంలోకి వ‌చ్చిన తర్వాత కొత్తగా 16 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. నిర్మాణంలో ఉన్న‌మరో 79 డయాలసిస్ సెంటర్ల ప‌నులు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>