న్యూజిలాండ్ చేతిలో భారత్‌కు 5-0తో ఘోర ఓటమి

కలం, స్పోర్ట్స్ :న్యూజిలాండ్‌తో (New Zealand) జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ఘోర పరాజయం చవిచూసింది. ఆక్లాండ్‌లో (Auckland) గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 5-0తో భారత్‌ను చిత్తు చేసింది. మ్యాచ్ ఐదో నిమిషంలోనే బిజోయ్ వర్గీస్ సెల్ఫ్ గోల్‌తో న్యూజిలాండ్ ఖాతా తెరిచింది. 34, 43వ నిమిషాల్లో జెస్సీ రాండాల్ మరో రెండు గోల్స్ చేయడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి కివీస్ 3-0 ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలోనూ న్యూజిలాండ్ జోరు తగ్గలేదు. 57వ నిమిషంలో క్రిస్ వుడ్ హెడర్‌తో గోల్ సాధించగా.. 74వ నిమిషంలో లాచ్లాన్ బేలిస్ ఐదో గోల్ నమోదు చేశాడు. భారత్‌కు గోల్ చేసే అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. గోల్‌కీపర్ విశాల్ కైథ్ కొన్ని కీలక సేవ్‌లతో మరింత పెద్ద ఓటమిని అడ్డుకున్నాడు. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 88వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో.. 138వ ర్యాంక్‌లో ఉన్న భారత్ పోటీపడలేకపోయింది. 2026 ప్రపంచకప్‌కు అర్హత సాధించిన జట్లతో ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ 16 గోల్స్ సమర్పించుకుని, కేవలం రెండు గోల్స్ మాత్రమే చేసింది. న్యూజిలాండ్‌తో భారత్ తదుపరి మ్యాచ్ నవంబర్ 15న క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>