13 ఏళ్లకే గోల్ఫ్‌లో ఓజస్విని సంచలనం

కలం, స్పోర్ట్స్ : 13 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న భారత యువ గోల్ఫర్ ఓజస్విని సరస్వత్ (Ojaswini Saraswat) మరోసారి వార్తల్లో నిలిచింది. జైపూర్‌లో జరుగుతున్న మహిళల ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ 14వ అంచె తొలి రౌండ్‌లో అదరగొట్టింది. చివరి హోల్‌లో ఈగిల్ సాధించి, అనన్య దాతర్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకుంది. రాంబాగ్ గోల్ఫ్ క్లబ్‌లో జరిగిన ఈ రౌండ్‌లో ఓజస్విని 71 స్కోరు నమోదు చేసింది. ఈ కోర్స్ ఆమె సొంత మైదానం కావడంతో ఆ అనుభవం కలిసొచ్చింది. ఆరంభంలో వరుసగా ఆరు హోల్స్‌లో పార్ సాధించిన ఆమె.. ఆ తర్వాత రెండు బోగీలు చేసింది. పదో హోల్‌లో మరో బోగీతో వెనుకబడింది.

అయితే 17వ హోల్‌లో ఈగిల్ కొట్టి తిరిగి పుంజుకుంది. అనన్య దాతర్ కూడా 71 స్కోరుతో ఓజస్వినితో కలిసి అగ్రస్థానంలో నిలిచింది. దుర్గా నిట్టూర్, ఖుషీ ఖనిజౌ 73 స్కోరుతో మూడో స్థానంలో ఉన్నారు. రిధిమా దిలావరి సహా ఏడుగురు 74 స్కోరుతో ఐదో స్థానాన్ని పంచుకున్నారు. టోర్నీకి ముందు ఫేవరెట్‌గా భావించిన వానీ కపూర్‌కు మాత్రం తొలి రౌండ్ కలిసిరాలేదు. ఆమె 75 స్కోరుతో 12వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో అగ్రస్థానంలో ఉన్న రిధిమా దిలావరి 74 స్కోరుతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>