కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, జనసేన కార్యకర్తలు, మద్దతుదారుల మధ్య విభేదాలు సృష్టించేలా రవీంద్రబాబు పోస్టులు పెట్టారని పిఠాపురం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన మరికొందరిపై కూడా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదైనట్లు సమాచారం.

