కలం, వెబ్ డెస్క్: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు (AP Local Body Elections) సంబంధించి నేడు (గురువారం) మరో కీలక అప్ డేట్ రానుంది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో పోలింగ్ నిర్వహించేలా ఎస్ఈసీ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. నవంబర్ 13, 16, 19 తేదీల్లో మూడు విడతలకు సంబంధించిన నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. కాగా, షెడ్యూల్ విడుదల చేయనుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది.
మరోవైపు, రాష్ట్రంలో వివిధ కోర్టు కేసుల కారణంగా పెండింగ్ లో ఉన్న పురపాలక సంఘాల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయనుంది. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు.. పలు మున్సిపాలీటీలకు పోలిం నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నవంబర్ 26న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

