ముథోల్ యువకుడి స్వదేశీ రాకకు బండి సంజయ్‌కు వినతి

కలం, ముథోల్ : దుబాయ్‌లో హోటల్ యాజమాన్యం వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముథోల్ మండలం తరోడా గ్రామానికి చెందిన సాయి కుమార్‌ను (Mudhole Youth) వెంటనే స్వదేశానికి రప్పించాలని బాధిత కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి నేతృత్వంలో సాయి కుమార్ తండ్రి కన్యబోయి లక్ష్మణ్, కుటుంబ సభ్యులు మంగళవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

దుబాయ్‌లో హోటల్ యాజమాన్యం వేధింపుల కారణంగా తన కుమారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని లక్ష్మణ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి తన కుమారుడిని క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో తరోడా మాజీ సర్పంచ్ రవికిరణ్ గౌడ్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>