కలం, స్పోర్ట్స్: అండర్-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు అదరగొట్టింది. యూఏఈపై 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 309 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ (Aaryavir Sehwag) 17 ఫోర్లు, 7 సిక్సర్లతో 160 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అతనికి తోడుగా వీకే వినీత్ 65 పరుగులు చేసి రెండో వికెట్‌కు 193 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
వీరిద్దరి దూకుడుతో భారత్ టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. అనంతరం 310 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఏఈ 50 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌట్ అయింది. యూఏఈ బ్యాటర్లలో అహ్మద్ ఖుదాదాద్ 74 పరుగులతో, నూరుల్లా అయూబీ 39 పరుగులతో పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ 37 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ అద్భుత విజయంతో భారత అండర్-19 జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్ పోరులో భారత్ తదుపరి అఫ్గానిస్తాన్ జట్టుతో తలపడనుంది.

