ప్రభుత్వ భూములు రక్షించాలని జీవన్ రెడ్డి వినతి

కలం, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ భూములు, మున్సిపల్ ఆస్తులను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి (Jeevan Reddy) కోరారు. ఈ మేరకు మంగళవారం జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 138 పరిధిలో మున్సిపల్ పార్కు, ఫైర్ స్టేషన్ తదితర ప్రభుత్వ, మున్సిపల్ ఆస్తులు ఉన్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

గతంలో ఏపీ హైకోర్టు, సివిల్ కోర్టుల్లో జరిగిన న్యాయపోరాటాలు, కోర్టుల ఉత్తర్వులను ప్రస్తావిస్తూ సర్వే నెంబర్ 138లోని భూముల విషయంలో స్పష్టమైన రికార్డులు నిర్వహించాలని జీవన్ రెడ్డి కోరారు. ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లకుండా, అక్రమ రిజిస్ట్రేషన్లులు జరగకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రయోజన భూములను సెక్షన్ 22-A ప్రకారం నిషేధిత జాబితాలో చేర్చి, ఎలాంటి అక్రమ లావాదేవీలకు అవకాశం లేకుండా చూడాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>