ఇటాలియా టీ10 లీగ్‌లో క్రిస్ గేల్

కలం, స్పోర్ట్స్ : వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ (Chris Gayle) మళ్లీ బ్యాట్ పట్టేందుకు సిద్ధమయ్యారు. తొలిసారిగా జరుగుతున్న ఇటాలియా టీ10 లీగ్‌లో వెనిస్ లైవ్‌వైర్స్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నారు. 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన గేల్.. ఈ లీగ్ మ్యాచ్‌ల్లో దుమ్మురేపుతున్నారు. ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2026 ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆయన జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే జోష్‌తో టీ10 లీగ్‌లోకి అడుగుపెడుతున్నారు. కొత్త లీగ్‌లో భాగం కావడం, అభిమానులను అలరించడం ఎంతో సంతోషంగా ఉందని గేల్ తెలిపారు. టీ10 క్రికెట్ ఎంతో వేగవంతమైనదని, మైదానంలో భారీ సిక్సర్లు బాదుతూ వినోదాన్ని పంచుతానని ధీమా వ్యక్తం చేశారు.

భారత మాజీ క్రికెటర్ ఎంఎస్‌కే ప్రసాద్ (MSK Prasad) ఈ జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. గేల్ (Chris Gayle) రాక తమ జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను గెలిపించే సత్తా గేల్‌కు ఉందని పేర్కొన్నారు. క్రిస్ గేల్‌ను జట్టులోకి తీసుకోవడం గర్వంగా ఉందని వెనిస్ ఛైర్మన్ మోహిత్ చెప్పారు. లీగ్‌లో తమ జట్టును బలమైన శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. వెస్టిండీస్ తరఫున 103 టెస్టులు, 301 వన్డేలు, 79 టీ20లు ఆడిన గేల్.. ఐపీఎల్‌లో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఆల్‌టైమ్ రికార్డును ఇప్పటికీ తన పేరిటే ఉంచుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త లీగ్‌లో గేల్ ఏ స్థాయిలో చెలరేగుతారో చూడాలి.

Also Read : ఖవాజా కామెంట్స్‌పై స్టార్క్ రియాక్షన్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>