వసతి గృహాల సరుకులపై అదనపు కలెక్టర్ సమీక్ష

కలం, ఆదిలాబాద్ : ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలకు సరఫరా చేసే సరుకుల విషయంలో పారదర్శకత ఉండేలా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నాకాఫ్ ద్వారా ప్రభుత్వ వసతి గృహాలు, కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు సరఫరా చేస్తున్న సరుకుల కోసం (Govt Hostel Supplies) కొత్తగా ఏర్పాటు చేసిన ‘యూనిఫైడ్ వెల్ఫేర్ హాస్టల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (UWHMS) పోర్టల్ ద్వారా ఇండెంట్ నమోదు తదితర అంశాలపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెల 5వ తేదీలోపు సంబంధిత అధికారులందరూ UWHMS పోర్టల్ ద్వారా తప్పనిసరిగా ఇండెంట్ నమోదు చేసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాలకు చేరే సరుకుల నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే స్వీకరించాలని సూచించారు. ఒకవేళ సరుకుల్లో నాణ్యత లోపాలు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని అంగీకరించకుండా వెంటనే వెనక్కి పంపించాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి సునీత, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సోనియా, వివిధ వసతి గృహాల సంక్షేమాధికారులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, నాకాఫ్ ఇన్‌ఛార్జ్ రమాకాంత్, వంశీకృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>